అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. నారాయణ్ దాస్ కె. నారంగ్, పీ.రామ్మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. దీంతో అటు థియేటర్లు కూడా 50 శాతం ఆక్యూపెన్సీతో ఓపెన్ కానున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే పలు సినిమాలు విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా కూడా విడుదల కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే లవ్ స్టోరీ విడుదల తేదీపై చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే లవ్ స్టోరీ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. అలాగే థియేటర్లలో రోజుకు 3 షోలను మాత్రమే అనుమతిస్తే.. సినిమా రిలీజ్ చేయాలని అనుకోవట్లేదని.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తామన్నారు. అలాగే జూలై రెండో వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటున్నట్లుగా చెప్పారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లుగా తెలిపారు.
RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?