AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్‌ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్‌ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్‌ దేవరకొండ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు.

EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ
Nagavamshi
Rajeev Rayala
|

Updated on: Sep 08, 2026 | 9:31 PM

Share

సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ..  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తమ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా, ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్‌పై వచ్చిన చిన్నపాటి వివాదం గురించి నాగ వంశీ స్పందించారు. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తీసిన దర్శకుడి నుండి ఇలాంటి ట్రైలర్ ఆశించలేదన్న విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రతి దర్శకుడు తమ ప్రతిభ మేరకు ఎలాంటి కథలైనా చెప్పవచ్చని, సినిమాను చూసే ముందు దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూను చూడమని సూచించారు. “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమ్మాయిని కలవడం, ప్రేమించడం కామన్. అవి సినిమాటిక్‌గా చూపించడంలో తప్పు లేదు” అని ఆయన అన్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య బంధాన్ని, వారి మధ్య ఉండే సంబంధాన్ని ఎంత స్వచ్ఛంగా, ప్యూర్‌గా చూపించారో సినిమా చూస్తే తెలుస్తుందని నాగవంశీ అన్నారు.

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

సాధారణ తెలుగు సినిమాల్లో చూపించే ఇంటి సమస్యలు, కుటుంబ గొడవలకు భిన్నంగా, ఒక జంట ప్రాక్టికల్‌గా ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో చాలా బాగా చూపించారని వంశీ వివరించారు. ఈ సినిమాను గర్ల్‌ఫ్రెండ్‌తో, భార్యతో లేదా తల్లితో సహా ఎవరితోనైనా కలిసి చూడవచ్చని, ఇది ఎమోషన్స్  పంచుకునే కుటుంబ చిత్రమని స్పష్టం చేశారు. ట్రైలర్‌లో కనిపించిన ముద్దు సన్నివేశం ఆధారంగా సినిమాను అడల్ట్ ఫిల్మ్గా భావించవద్దని ప్రేక్షకులను కోరారు.”రెండు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో దాదాపు గంటా నలభై నిమిషాలు వైష్ణవి, ఆనంద్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలకూ  మీరు ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది” అని నాగ వంశీ తెలిపారు.

అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

నిజామాబాద్, వనపర్తి వంటి రూరల్ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న కుర్రాడు, ఒక కాన్ఫిడెంట్ అమ్మాయి ప్రేమలో పడితే వారి బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారని వివరించారు. ఆర్థిక నేపథ్యం ఆధారంగా సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయో కూడా సినిమాలో ఉంటుందని తెలిపారు. అలాగే తనకు రొమాంటిక్ కామెడీ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఇష్టమైన జానర్ అని వంశీ వెల్లడించారు. ఏం మాయ చేసావే వంటి చిత్రాలను చూసినప్పుడు అలాంటి సినిమాలు తీయాలని కోరిక ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఎపిక్ మొదటి భాగంలో హృదయాన్ని హత్తుకునే మూడు, నాలుగు సన్నివేశాలు ఉన్నాయని, ప్రేమించుకునే జంటలు ఈ సినిమాతో తప్పకుండా కనెక్ట్ అవుతారని అన్నారు.

ఇవి కూడా చదవండి

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు
ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు
వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!
వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..!
ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..!
EV or CNG కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్..!
EV or CNG కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్..!
గుడికి వెళ్లే టైమ్ లేదా?.. ఇంట్లోనే ఇలా చేస్తే సరిపోతుందట!
గుడికి వెళ్లే టైమ్ లేదా?.. ఇంట్లోనే ఇలా చేస్తే సరిపోతుందట!
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు
మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు
నోస్ బ్లీడింగ్ నుంచి కడుపు ఉబ్బరం వరకు.. ఈ లక్షణాలుంటే అలర్ట్
నోస్ బ్లీడింగ్ నుంచి కడుపు ఉబ్బరం వరకు.. ఈ లక్షణాలుంటే అలర్ట్
కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
కూకట్‌పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి బయటకు పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో
బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి బయటకు పారిపోయిన కంటెస్టెంట్.. వీడియో