Priyanka Chopra: ప్రియాంక భర్తకు ప్రమాదం.? షో మధ్యలోనే పారిపోయిన నిక్.. వైరల్ వీడియో..

|

Oct 17, 2024 | 9:26 AM

తన సోదరులతో కలిసి జోనాస్ బ్రదర్స్ పేరుతో దేశ విదేశాల్లోనూ అనేక మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. నిక్ జోనాస్ పాటలు, అతడి మ్యూజిక్ ఈవెంట్స్ కు లక్షలాది మంది అభిమానులు వస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన ఈవెంట్లో షో మధ్యలోనే పరుగులు పెట్టాడు నిక్. దీంతో అతడి అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. నిక్ ఆకస్మాత్తుగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోవడానికి ఓ కారణం కూడా ఉంది. అసలు విషయానికి వస్తే..

Priyanka Chopra: ప్రియాంక భర్తకు ప్రమాదం.? షో మధ్యలోనే పారిపోయిన నిక్.. వైరల్ వీడియో..
Nick Jonas
Follow us on

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప కూడా జన్మించింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో నిక్ జోనాస్‏కు మంచి క్రేజ్ ఉంది. తన సోదరులతో కలిసి జోనాస్ బ్రదర్స్ పేరుతో దేశ విదేశాల్లోనూ అనేక మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటాడు. నిక్ జోనాస్ పాటలు, అతడి మ్యూజిక్ ఈవెంట్స్ కు లక్షలాది మంది అభిమానులు వస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన ఈవెంట్లో షో మధ్యలోనే పరుగులు పెట్టాడు నిక్. దీంతో అతడి అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. నిక్ ఆకస్మాత్తుగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోవడానికి ఓ కారణం కూడా ఉంది. అసలు విషయానికి వస్తే..

నిక్ సోదరులు పెరూలో ప్రత్యక్ష సంగీత కచేరీని నిర్వహిస్తున్నారు. నిక్ జోనాస్, జో జోనాస్, కెవిన్ జోనాస్ కూడా వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఈవెంట్లో గ్యాలరీలో భారీగా అడియన్స్ ఉన్నారు. వేదికపై ఉన్న నిక్.. తన వెనుక గ్యాలరీలో నిలబడి ఉన్న వ్యక్తులను చూసి, ఉన్నట్లుండి స్టేజ్ దిగి తన సెక్యూరిటీకి చేయి ఊపుతూ పరుగెత్తాడు. నిక్ చేసిన పని చూసి అడియన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నిక్ జోనాస్ స్టేజ్ పై పాట పాడుతుండగా.. అతడిపై గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ ఉపయోగించారు. ఆ రెడ్ లైట్ రైఫిల్ గన్లలో కూడా ఉపయోగిస్తారు. దీంతో ఆ రెడ్ లైట్ ప్రమాద సూచికగా భావించిన నిక్.. స్టేజ్ పై నుంచి కిందకి వెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న వారిని తనిఖీ చేసి లేజర్ లైట్ ఉపయోగించిన వ్యక్తిని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.

ఇది చదవండి : OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే

ఇవి కూడా చదవండి

నిక్ జోనాస్ ఫేమస్ హాలీవుడ్ రాపర్, పాప్ సింగర్. జోనాస్ బ్రదర్స్ అనే బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నిక్ ఒకప్పుడు భారతదేశంలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా 2018 లో వివాహం చేసుకున్నారు. నిక్‌ని పెళ్లాడిన తర్వాత ప్రియాంక హాలీవుడ్‌లో స్థిరపడింది. వీరికి మాల్తీ అనే పాప ఉంది. నిక్ జోనాస్ గాయకుడే కాదు పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.