Premikudu re-release: ప్రభుదేవా-నగ్నాల బ్లాక్ బాస్టర్ హిట్‌ ‘ప్రేమికుడు’ రీ-రిలీజ్‌

|

Sep 08, 2024 | 11:19 AM

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్‌ హిట్‌ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్‌ కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్‌గా నటించారు.

Premikudu re-release: ప్రభుదేవా-నగ్నాల బ్లాక్ బాస్టర్ హిట్‌ ప్రేమికుడు రీ-రిలీజ్‌
Premikudu
Follow us on

మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ సినిమాలో కీ రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే.

30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను వీపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు అందరి నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అంతే. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రి రిలీజ్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.