ఇంతకు ముందు భారతీయ సినిమాలు విదేశాల్లో విడుదల కావడం అరుదుగా జరిగేది. అత్యధికంగా మలేషియా, సింగపూర్, దుబాయ్, అమెరికాలోని కొన్ని నగరాల్లో మాత్రమే భారతీయ సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. అంతే కాదు విదేశీ గడ్డపైనే రికార్డ్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఇటీవల, భారతీయ సినిమాలు ఒక అడుగు ముందుకు వేసి తన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ప్రమోషనల్ ప్రోగ్రామ్‌లను విదేశాల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అమెరికాలోని డల్లాస్ లో అట్టహాసంగా జరిగాయి. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరో అడుగు ముందుకేశాడు. ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన నటించిన ‘కల్కి’ సినిమా ప్రమోషన్‌ను న్యూయార్క్‌లో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ప్రభాస్ తన తదుపరి సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని జపాన్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమా జపాన్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ లేదా ఆడియో లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆ ఘనతను అందుకోనున్నాడు.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. అయితే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జపాన్‌లో జరగనుందని తెలుస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అద్భుతంగా వచ్చాయంటున్నారు మేకర్స్. అలాగే తమన్ ఇప్పటికే చేసిన ‘రాజా సాబ్’ పాటల జపాన్ వెర్షన్‌ను రూపొందించాలని దర్శకనిర్మాతలు సూచించారు. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్‌లో నిర్వహించే అవకాశం ఉందని తమన్ స్వయంగా హింట్ ఇచ్చాడు. ఇటీవల ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ జపాన్‌లో విడుదలైంది. విడుదలకు ముందే ప్రభాస్ జపాన్ వెళ్లాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ప్రభాస్ జపాన్ టూర్ కు వెళ్లలేదు. అయితే జపాన్‌లోని తన అభిమానుల కోసం ఒక వీడియోను పంచుకున్నాడు డార్లింగ్. ఆ వీడియోలో ప్రభాస్ జపాన్ భాషలో మాట్లాడాడు. ఇప్పుడు జపాన్ అభిమానుల కోసం తన సినిమా ఆడియో కార్యక్రమాన్ని జపాన్‌లో నిర్వహిస్తున్నాడు.
గత కొన్ని దశాబ్దాలుగాజపాన్‌లో భారతీయ సినిమాలకు బాగా డిమాండ్ ఉంది. హిందీ ‘ఆవారా’తో సహా చాలా సినిమాలు జపాన్‌లో భారీ విజయాన్ని సాధించాయి. రజనీకాంత్ నటించిన ముత్తు జపాన్‌లో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జపాన్‌లో కూడా రజనీకాంత్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సమంత, నాని నటించిన ‘ఈగ’ చిత్రం జపాన్‌లో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Royal by blood……
Rebel by choice….
Claiming what was always his! 🔥🔥Motion Poster out now.https://t.co/v1dhha0Wxa#HappyBirthdayPrabhas ❤️#Prabhas #TheRajaSaab pic.twitter.com/cZyLxeRNez
— The RajaSaab (@rajasaabmovie) October 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.