Kalki 2898 AD: ‘సంధ్య’లో క‌ల్కి 50 డేస్ సెల‌బ్రేష‌న్స్‌.. అభిమానుల నినాదాలతో హోరెత్తిన థియేటర్.. వీడియో వైరల్

జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి కలెక్షన్ల మోత మోగించింది. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. కాగా గురువారం (ఆగస్టు 15) తో కల్కి థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Kalki 2898 AD: 'సంధ్య'లో క‌ల్కి 50 డేస్ సెల‌బ్రేష‌న్స్‌.. అభిమానుల నినాదాలతో హోరెత్తిన థియేటర్.. వీడియో వైరల్
Kalki 2898 AD Movie
Follow us

|

Updated on: Aug 16, 2024 | 10:28 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్‌, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి కలెక్షన్ల మోత మోగించింది. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. కాగా గురువారం (ఆగస్టు 15) తో కల్కి థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇక కల్కి సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ లోని సంధ్య థియేటర్ లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురు అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే 50 రోజులకు సంబంధించి భారీ కేక్ ను కూడా కట్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్‌ లో అభిమానులు పెద్ద ఎత్తున కేకలు, నినాదాలు చేశారు.

సంధ్య థియేటర్‌లో కల్కి 50 రోజుల సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ఈ మూవీకి రెండో భాగం కూడా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ఇప్ప‌టికే తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే రెండో పార్టుకు సంబంధించిన షూటింగ్‌ను మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరోవైపు కల్కి మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగ‌స్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

నాగ్ అశ్విన్ కు ఘన సన్మానం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!