'ప్లీజ్ నన్ను అలా పిలవకండి'.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్
TV9 Telugu
15 August 2024
పెళ్లి సందడి చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది శ్రీలీల. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.
ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందీ అందాల తార. ఈ మూవీ 100 కోట్లకు పైగానే రాబట్టింది.
ఆ తర్వాత ఆదికేశవ, స్కంద, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి వరుసగా పెద్ద సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ.
ఈ సినిమాలు విజయం సాధించకపోయినా శ్రీలీల నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం నితిన్ తో కలిసి రాబిన్ హుడ్, పవన్ కల్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది శ్రీలీల.
కాగా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న శ్రీలీల తనను మాత్రం.. స్టార్ హీరోయిన్ అని పిలవకండని రిక్వెస్ట్ చేస్తోంది.
స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందని కానీ, ఇప్పుడే తనను అలా పిలవడం నచ్చదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కాగా ఇటీవల ఎన్టీఆర్ బావ మరిది నటించిన ఆయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైంది శ్రీలీల.
ఇక్కడ క్లిక్ చేయండి..