ముందు కల్కిలో చేయనన్నాను.. కీర్తీ సురేష్ కామెంట్స్
Anil Kumar
15 August 2024
రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడీలో తనకు కూడా నటించే అవకాశం వచ్చిందని అయితే..
డైరెక్టర్ నాగ అశ్విన్ చెప్పిన ఆ రోల్‌ను తాను నచ్చక అది రిజెక్ట్ చేశానని చెప్పారు హీరోయిన్ కీర్తి సురేష్.
అయితే ప్రాజెక్ట్ కే అనౌన్స్ చేసిన తరువాత తానే మళ్లీ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుందని డైరెక్టర్ ని అడగటంతో..
ప్రభాస్ యూజ్ చేసిన కార్ 'బుజ్జి' రోల్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు కీర్తి సురేష్.
అయితే కల్కి లో బుజ్జి గా వాయిస్ ఇచ్చినందుకు తాను చాల సంతోషిస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
కానీ తనకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏ పాత్ర ఆఫర్ చేశారో మాత్రం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చింది కీర్తీ.!
కాగా కల్కి సినిమాలో మృణాల్ పాత్ర అయ్యుంటుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. సినిమాలో ఆమె పాత్ర చనిపోతుంది.
అందుకనే కీర్తిసురేష్ రిజెక్ట్ చేసి ఉంటుందని అబిప్రాయ పడుతూ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు మరికొందరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి