Actress Karate Kalyani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి‌పై జగద్గిరిగుట్ట పోలీసుల కేసు నమోదు!

సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరోసారి చిక్కుల్లో పడ్డారు. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌పై కేసు నమోదైంది

Actress Karate Kalyani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి‌పై జగద్గిరిగుట్ట పోలీసుల కేసు నమోదు!
Actress Karate Kalyani

Updated on: Dec 25, 2021 | 3:26 PM

FIR on Actress Karate Kalyani: సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరోసారి చిక్కుల్లో పడ్డారు. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌పై కేసు నమోదైంది. ఎప్పుడు వివాదస్పద అంశాల్లో ఉంటూ, రోజు వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి మరోసారి ఆమె వ్యవహారం సంచలనంగా మారింది. ఓ హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు రావడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను డిస్ క్లోస్ చేసినందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్ల ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి జగత్గిరిగుట్ట, ఏల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లేంట్ దాఖలు చేశారు. ఆమె వెంటనే కేసు నమోదు చేయాలని రంగా రెడ్డి కోర్టు ఆదేశించింది. దీంతో కోర్ట్ ఆదేశాల ప్రకారం కరాటే కళ్యాణి పై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

FIR on Karate KalyaniCamScanner 12-25-2021 09.51

Read Also….  Narendra singh Tomar: సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తాం.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంచలన వ్యాఖ్యలు