Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే భుజానికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని ధీరుబాయ్ కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..
Anna Lezinova

Updated on: Jul 18, 2026 | 9:05 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న పవన్.. ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. అయితే పవన్ భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ సతీమణి అన్నా లెచినోవా తిరుమల చేరుకున్నారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. రోడ్డు మార్గంలో తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. శుక్రవారం వరహ స్వామిని దర్శించుకున్న ఆమె.. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఎలాంటి ఆడంబరం, సెక్యూరిటీ లేకుండానే అన్నా లెజినోవా అలిపిరి మెట్లమార్గంలో నడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ మరో నాలుగు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి వైద్యులు సూచించినట్లు సమాచారం. హైదరాబాద్ లోని నివాసం తీసుకుంటున్నారు పవన్. మరో నాలుగు వారాలపాటు ఆయన భుజానికి ఫిజియోథెరపి నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. పవన్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

కాలినడకన పవన్ సతీమణి..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us