PKSDT : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సినిమా థియేటర్స్‌లోకి వచ్చేది అప్పుడే

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. అలాగే పవన్ ఈ మూవీలో దేవుడిగా కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

PKSDT : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సినిమా థియేటర్స్‌లోకి వచ్చేది అప్పుడే
Pawan Kalyan,saidharam Tej

Updated on: Mar 24, 2023 | 4:21 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీస్‌లో వినోదయ సిత్తం సినిమా రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళ్ లో తెరకెక్కిన వినోదయ సిత్తం సినిమాను నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించారు. ఇక ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. అలాగే పవన్ ఈ మూవీలో దేవుడిగా కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 28న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తేరి మూవీ రీమేక్ లో నటిస్తున్నారు పవన్. అటు సాయి ధరమ్ తేజ్ కూడా విరూపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే పవన్, తేజ్ సినిమానుంచి అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.

Loading...
Unable to load recommendations.
Follow Us