Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా ప్రేమ కథ సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టావు. అలాంటి సినిమాలో ఈ సినిమా ఒకటి ఎన్ని ప్రేమకథలు వచ్చిన ఈ సినిమాను బీట్ చేయలేవు. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..

Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్
Movie

Updated on: Jun 28, 2026 | 8:26 PM

తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నిరీక్షణ. ఈ సినిమా విడుదలైన 44 ఏళ్లు పూర్తయ్యింది, ఆ సినిమా విశేషాలను సినీ విశ్లేషకుడు చిలకగంటి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, దర్శకుడు బాలు మహేంద్ర మేధస్సు, ఇళయరాజా అజరామర సంగీతం, ఈ సినిమా కల్పించిన అనుభూతిని వివరించారు. బాలు మహేంద్రకేవలం దర్శకుడిగానే కాక, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, రచయితగా ఆయన బహుముఖ ప్రజ్ఞను ప్రశంసించారు. వెట్రిమారన్, బాల వంటి దర్శకులకు బాలు మహేంద్ర స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. 1970వ దశకంలో శంకరాభరణం, మన ఊరి పాండవులు వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, 1985లో మలయాళంలో ‘యాత్ర (ది జర్నీ)’ పేరుతో తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మమ్ముట్టి, శోభన, తిలకన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కేరళలో సంవత్సరం పాటు ఆడి ఘన విజయం సాధించింది.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే

నిరీక్షణ కథా నేపథ్యం 1975-77 అత్యవసర పరిస్థితులు (ఎమర్జెన్సీ) సమయంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. అప్పటి కఠిన చట్టాలు, పోలీసుల ప్రవర్తన, జైళ్లలో ఖైదీల పరిస్థితిని చిత్రీకరిస్తూనే, అందులో ఓ హృద్యమైన ప్రేమకథను చొప్పించి బాలు మహేంద్ర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మలయాళంలో విజయం సాధించిన వెంటనే, బాలు మహేంద్ర స్వయంగా తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో భానుచందర్, అర్చనలతో అదే కథను తెరకెక్కించి, దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను తానే స్వీకరించారు.

ఇది కూడా చదవండి : ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

బాలు మహేంద్ర దర్శకత్వంలో సహజత్వం ప్రధానం. తన చిత్రాలలో నటీనటులకు మేకప్ లేకుండా సహజమైన లైటింగ్‌లో చిత్రీకరించేవారు. ‘నిరీక్షణ’లో అర్చన పాత్ర చిత్రణ ప్రత్యేకంగా నిలిచింది. రవిక లేకుండా సాంప్రదాయ కేరళ శైలిలో ఆమెను చూపించిన తీరు ఎక్కడా అభ్యంతరకరంగా అనిపించకపోవడం బాలు మహేంద్ర గొప్పతనానికి నిదర్శనం. భానుచందర్ పోషించిన మురళీకృష్ణ, అర్చన పోషించిన తులసి పాత్రల మధ్య నిరీక్షణలోని గాఢత, స్వచ్ఛతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం అజరామరం. “ఆకాశం ఏనాటిదో”, “చుక్కల్లో తోచావే”, “తీయనీ దానిమ్మ”, “యమునా తీరే” వంటి పాటలు ఎప్పటికీ పాతబడవు. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ఈ పాటలు తెలుగు సినిమా సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. నిరీక్షణ కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభూతి. నిశ్శబ్దం కూడా మాట్లాడుతుందని, మౌనం కూడా ఒక సంగీతమని బాలు మహేంద్ర ఈ చిత్రం ద్వారా నిరూపించారు. ప్రేమలోని పవిత్రతను, నిరీక్షణలోని బలమైన భావోద్వేగాలను అత్యంత సున్నితంగా తెరకెక్కించిన ఈ చిత్రం. 44 ఏళ్లు గడిచినా, నిరీక్షణ సినిమా తన ప్రభావంతో నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని నిలుపుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us