RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టా్త్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పై

RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..
Komuram Bheemudo Song

Updated on: Dec 25, 2021 | 7:23 AM

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టా్త్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించడంతో ఈ మూవీ కోసం నందమూరి, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రమోషన్స్‏లో బీజీగా ఉన్నారు.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అలాగే గత కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నిన్న ఈ మూవీ నుంచి కొమురం భీముడో పాటను విడుదల చేశారు. కొమురం భీముడో.. అంటూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ్ రచించగా.. కీరవాణి తనయుడు కాల భైరవ ఆలపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూ్బ్‏లో దూసుకుపోతుంది. మరోవైపు ఈపాట కాపీ చేశారంటూ నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ రచించి పాడిన మదనా సుందరీ.. మదనా సుందరీ అనే పాట మాదిరిగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కొమురం భీముడో పాట వినగానే.. అచ్చం గద్దర్ గొంతుక నుంచి వచ్చిన మదనా సుందరీ.. పాట మాదిరిగానే అనిపిస్తుంది.. ఆ పాటను మ్యూజిక్… అచ్చంగా ఉందంటూ నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.

Also Read: Bigg Boss telugu: ఫిబ్రవరిలో బిగ్‏బాస్ .. రాబోయే సీజన్ హోస్ట్ ఎవరో తెలుసా..

Hit.Movie: తెలుగు ఎన్ఆర్ఐ ఓటీటీ ప్లాట్‎ఫారమ్.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా సినిమాలు చూడొచ్చటా..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us