Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?

|

Aug 19, 2021 | 4:09 PM

మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీ..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?
Megastar
Follow us on

Chiranjeevi : మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవనుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే లూసిఫర్ సెట్‌లో అడుగు పెట్టనున్నాడు చిరు. ఇక ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాయన తార హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో చిరుకు చెల్లిగా నయన్ నటిస్తుందని వార్తలు వినిపించాయి. ముందుగా మెగాస్టార్ సిస్టర్ పాత్ర కోసం చాలా మంది పేర్లను పరిశీలించారు. చివరకు నయనతారను ఫిక్స్ చేశారు. అయితే తాజాగా నయన్ పాత్రపై మరో వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో విలన్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్  హీరో సత్య దేవ్ నటిస్తున్నాడు. మలయాళంలో ఈ పాత్రలో బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ నటించారు. ఆయన పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుంది. వివేక్ భార్యగా మంజు వారియర్ నటించారు. అయితే ఇప్పుడు మంజు వారియర్ పాత్రలో నయన్ కనిపించనున్నారని అంటున్నారు. అంటే సత్య దేవ్‌కు భార్యగా నాయన తార కనిపించనున్నారు. భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అక్రమాలకు పాల్పడుతుంటాడు విలన్. ఈ సినిమాలో సత్య దేవ్ నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. నయన్ పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఇక మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్