
ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ సామర్థ్యం, సెట్‌లోని అనుభవాలు, అలాగే తన అదుర్స్ చిత్రంలో చంద్రకళ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభకు తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. “జూనియర్ ఎన్టీఆర్ రిహార్సల్స్ లేకుండానే అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. ఆయన ఎలా మారుతారో తెరపై చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎన్టీఆర్ వంటి వారు రిహార్సల్స్ చేయకుండానే డ్యాన్స్ చేస్తారని చాలా మంది చెబుతారు, కానీ చాలా మంది నటులు రిహార్సల్స్ చేస్తారు. అయితే, ఎన్టీఆర్ నేను చూసిన ఏకైక హీరో, ఆయన ఎప్పుడూ రిహార్సల్స్ చేయరు. అప్పట్లో ఆయన చేయలేదు. ఇప్పుడు చేస్తారో లేదో నాకు తెలియదు,” అని నయనతార తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..
ఎన్టీఆర్ సెట్‌లో చాలా సరదాగా ఉంటారని, ఆయనతో కలిసి పనిచేసినప్పుడు జరిగిన ఒక సంఘటనను నయనతార గుర్తు చేసుకున్నారు. “ఒకరోజు నేను టచ్-అప్ చేసుకుంటున్నాను. ఎన్టీఆర్ నన్ను నిశితంగా చూస్తూ, ఎందుకు అంత టచ్-అప్ చేసుకుంటున్నావు? ఎవరూ నిన్ను చూడరు, అందరూ నన్నే చూస్తారు, అని సరదాగా ఆటపట్టించారు” అని నయనతార వెల్లడించారు. ఎన్టీఆర్ ఎలాంటి కదలికలైనా అలవోకగా చేస్తారని, డ్యాన్సర్‌లు చేసిన దానికంటే చాలా అద్భుతంగా చేస్తారని ఆమె ప్రశంసించారు. “అయినప్పటికీ, మా రాజమౌళి నాటు నాటు పాటకు ఎన్టీఆర్ చేత చాలా సార్లు చేయించారు,” అని నయనతార చివర్లో నవ్వుతూ పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
నయనతార తన కెరీర్‌లో చేసిన అదుర్స్ సినిమాలో చంద్రకళ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ పాత్రకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, మీమ్స్ ఉన్నాయని ఆమె తెలిపారు. సినిమాలో బ్రహ్మానందం (బట్టు) పాత్రతో చంద్రకళకు సంబంధించిన మీమ్స్‌ను ఆమె చూసి ఆశ్చర్యపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?
Nayanthara, Jr.ntr
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..