దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొ్చ్చే పేరు నయనతార (Nayanthara). తమిళం, మలయాళం, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా హావా కొనసాగిస్తోంది నయన్. ఇటీవలే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను వివాహాం చేసుకున్న నయన్ పెళ్లి తర్వాత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నింటిని కంటెంట్ ప్రాధాన్యత.. ఫీమేల్ ఒరియంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. లేడీ సూపర్ స్టార్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.
ఇటీవలే నయన్ కెరీర్లో 75వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం నయన్ దాదాపు రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందట. దక్షిణాది ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఇంత పెద్ద మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారి. దీపికా పదుకొణె, అలియా భట్ వంటి బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే సౌత్ హీరోయిన్ ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశించడం ఇదే ఫస్ట్ టైమ్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నయన్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో, షారుఖ్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.