ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రోజుకొక మలుపు తిరుగుతోంది. యువతి పై అత్యాచారం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. లైంగిక వేధింపుల కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీమాస్టర్ భార్య అయేషా నార్సింగి పీఎస్‌కు వచ్చారు. అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీమాస్టర్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అటు తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు అయేషా ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు జానీ మాస్టర్ అరెస్ట్ పై వివరణ ఇచ్చారు.
జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసుల అధికారిక ప్రకటన విడుదల చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును.. నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అన్నారు పోలీసులు. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం.. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతి పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని తెలిపారు.
జానీ మాస్టర్ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్.. ముంబై లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని తెలిపారు పోలీసులు. అలాగే జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టాం.. జానీ మాస్టర్ గోవా లో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నాం అన్నారు పోలీసులు. ముందుగా జానీని గోవా కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్ కింద హైదారాబాద్ తీసుకొస్తున్నాం.. రేపు కోర్టులో ప్రవేశపెడతాం అని అన్నారు పోలీసులు. జానీ మాస్టర్‌పై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య అయేషా ఖండించారు. ఆఅమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపిస్తే.. జానీని వదిలేసి వెళ్తా అని ఆమె అన్నారు. అయేషా మాట్లాడుతూ.. అందరూ కలిసి కావాలనే జానీ మాస్టర్‌ని టార్గెట్ చేశారు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. 16 ఏళ్లకే రేప్ జరిగినట్టు ఆధారాలున్నాయా.? ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి. లవ్ జిహాద్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టే జానీని టార్గెట్ చేశారు అని అయేషా అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.