Lakshya Movie: షూటింగ్ పూర్తిచేసిన లక్ష్య.. త్వరలోనే థియేటర్లలో కలుద్దామంటూ యంగ్ హీరో ట్వీట్..

యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం లక్ష్య. ఈ సినిమాకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా...

Lakshya Movie: షూటింగ్ పూర్తిచేసిన లక్ష్య.. త్వరలోనే థియేటర్లలో కలుద్దామంటూ యంగ్ హీరో ట్వీట్..
Lakshya

Updated on: Aug 30, 2021 | 6:07 PM

యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న లెటేస్ట్ చిత్రం లక్ష్య. ఈ సినిమాకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా… సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శౌర్యకు జోడీగా కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నాగశౌర్య కెరీర్లో 20వ చిత్రంలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందుల నాగశౌర్య సరికొత్త లుక్‏లో కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరో నాగశౌర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. లక్ష్య సినిమా జర్నీ మెమోరబుల్ అని.. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తైందని… త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతుంది అంటూ ట్వీట్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేశాడు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాతోపాటు.. నాగశౌర్య వరుడు కావలెను సినిమాలో నటిస్తున్నాడు.. ఇందులో రీతూవర్మ హీరోయిన్‍గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉంది.  ప్రాచీన విలువిద్య అంశంతో ముడిపడ్డ ఈ సినిమా కథ ఆసక్తికరంగా, వినూత్నంగా ఉంటుందట.

ట్వీట్..

Also Read: Bangarraju Movie: బంగార్రాజు సరసన మరో ముగ్గురు హీరోయిన్స్.. రంభ, ఊర్వసి, మేనకలు ఎవరంటే…

ఆదమరచి నిద్రపోతున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది ఈ చిన్నది..

Vijay Sethupathi: సెప్టెంబర్ మొత్తం విజయ్ సేతుపతి హావా.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us