
ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ నాగార్జున హవా కొనసాగుతుంది. ఈరోజు నాగ్ బర్త్ డే కావడంతో నెట్టింట్లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా.. నాగ్ తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం నాగార్జున్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది… ఇటు కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ కూడా చేస్తున్నాడు నాగ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీకి సిక్వెల్‌గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈరోజు (ఆగస్ట్ 29)న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా.. బంగార్రాజు సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నాగ్ తనయుడు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. అందులో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ నాగార్జున స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా కనిపించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది.
ట్వీట్..