Naga Chaitanya: ‘అన్ని విషయాలు చెప్పలేను.. కానీ నాకు చాలా నేర్పింది’.. నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లాల్ సింగ్ చద్దా.. ఆగస్ట్ 11న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లలో

Naga Chaitanya: అన్ని విషయాలు చెప్పలేను.. కానీ నాకు చాలా నేర్పింది.. నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..
Naga Chaitanya

Updated on: Aug 10, 2022 | 2:47 PM

అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య (Naga Chaitanya). 2009 నుంచి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన చైతూ.. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాతో బీటౌన్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు చైతూ. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లాల్ సింగ్ చద్దా.. ఆగస్ట్ 11న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లలో భాగంగా తన 13 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు చైతూ.

” ఇండస్ట్రీలో 13 సంవత్సరాలు అవుతుంది. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. అన్ని రకాల భావోద్వేగాలను పరిచయం చేసింది. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడే ఉన్నాను. ఎప్పటికప్పుడు మరింత నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను. నా పనిని అమితంగా ప్రేమిస్తున్నాను. నేను అన్ని విషయాలను స్పష్టంగా చెప్పలేను. కానీ నటుడిగా నాకంటూ క్లారిటీ వచ్చింది. ఈ సినీ పరిశ్రమ నాకు చాలా నేర్పింది. ఇంకా నేను దీనిని కొనసాగించాలనుకుంటున్నాను” అంటూ చైతూ చెప్పుకొచ్చాడు.

అలాగే సినీ ప్రమోషన్లలో భాగంగా తన మూవీ కంటే వ్యక్తిగత జీవితం గురించి అనేక ప్రశ్నలు రావడం పై చైతూ విసుగు చెందినట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తామిద్దరం తమ నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ప్రజలు తమ జీవితం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉందని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us