
ఇక ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో సదరు సంస్థ తీవ్రంగా స్పందించింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇటీవల మా మూవీ మెటీరియల్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో మేము చాలా ఆందోళన చెందాము. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశాము. త్వరలోనే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు అంటూ ట్వీట్ చేసింది.
ట్వీట్..
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. అలాగే మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..