ఇదెక్కడి సినిమా రా అయ్యా.! హారర్ సీన్స్ దెబ్బకు ఈ సినిమాను కొన్ని దేశాల్లో బ్యాన్ చేసేశారు..

ఓటీటీల్లో హారర్ సినిమాలకు కొదవే లేదు.. ప్రేక్షకులు ఎక్కువగా రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ జోనర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.

ఇదెక్కడి సినిమా రా అయ్యా.! హారర్ సీన్స్ దెబ్బకు ఈ సినిమాను కొన్ని దేశాల్లో బ్యాన్ చేసేశారు..
Ott Movie

Updated on: Mar 08, 2026 | 10:24 AM

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ జానర్ చిత్రాలను చూస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఈ రకమైన సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఇతర భాషల్లోని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్తసినిమాలు థియేటర్స్‌ సందడి చేస్తుంటే.. ఓటీటీలో హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఎంత భయమేసిన హారర్ సినిమాలు చూడటంమానరు కొంతమంది. భయపడుతూనే.. కళ్ళుమూసుకొని మరీ ఆ హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలో అడ్డరగొడుతోంది.ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాలిసిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూడకవడం మంచిది.

ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రతి సీన్ వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఈ సినిమాను చూసిన జనాలు థియేటర్స్ లోనే వాంతులు చేసుకుంటూ కేకలు వేశారు. మరికొంత మంది థియేటర్స్ నుంచి బయటకు పారిపోయారు కూడా.. అంతే కాదు ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం కూడా చేశారు. కొంతమంది మానసిక స్థితి దెబ్బతింది. దాంతో ఈ సినిమాను చాలా చోట్ల బ్యాన్ కూడా చేశారు. ఆ సినిమా పేరు ది ఎక్సార్సిస్ట్. బ్రిటన్‌లో ఈ చిత్రాన్ని నిషేధించారు.

విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 1973లో విడుదలైంది ఈ మూవీ కేవలం 23 థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యింది. అత్యంత భయంకరమైన ఈ సినిమాను చాలా చోట్ల నిషేదించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిల్లలతో వీక్షించడం నిషేధించబడింది.‘ది ఎక్సార్సిస్ట్’ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి హారర్ చిత్రం. ఈసినిమాలో కొన్ని సీన్స్ నిజంగా వణుకుపుట్టిస్తాయి. ఈ సినిమా మనదగ్గర అందుబాటులో లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ విధానంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను దైర్యముంటేనే చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us