సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. సమంత , నాగ చైతన్య దగ్గర నుంచి రీసెంట్ గా జయం రవి వరకు చాలా మంది సడన్ గా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులను షాక్ కు గురిం చేశారు. మొన్నామధ్య యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ నటుడు జీవి ప్రకాష్ దంపతులు కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు. జీవి ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయనకు మ్యూజిక్ అందించారు. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే… ప్రేమంట, ఆకాశం నీ హద్దురా,టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్,మట్కా ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ ఇలా పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అలాగే ప్రకాష్ తమిళ నాట చాలా ఫెమస్. నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీవి ప్రకాష్.
ఇదిలా ఉంటే జీవి ప్రకాష్ జంట ఇటీవలే విడిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకే పోస్ట్ షేర్ చేశారు తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు ఇరువురూ తెలిపారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. ఇంతకాలం అన్యున్యంగా ఉన్న ఈ ఇద్దరూ రీసెంట్ గా విడిపోతున్నాం అని ప్రకటించారు.
ఎంతో ఆలోచించిన తర్వాతే సైంధవి, నేను మా 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రశాంతత, మా జీవితాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మావి వేరు వేరు జీవితాలు. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మంచి చేస్తుందని అనుకుంటున్నాం అని పోస్ట్ చేశారు. అయితే రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి ఓ పాట పాడారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఈ జంట తిరిగి కలుస్తున్నారని వార్తలు షికారు చేశాయి. దీని పై జీవి క్లారిటీ ఇచ్చారు. మేము కలవడం అనేది జరగదు , ఇద్దరం ప్రొఫిషనల్స్ కాబట్టి కలిసి పాట పాడాము అని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి