నరేష్ లైఫ్‌లోకి పవిత్ర ఎంట్రీ అయినప్పటి నుంచే..ఆయన ఫ్యామిలీలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని కూడా అటు టాలీవుడ్, ఇటు సోషల్ మీడియాలో ఓ ప్రచారం నడుస్తోంది. కొంతకాలంగా నరేష్, పవిత్రలపై విపరీతమైన ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి ఎక్కడోచోట చెక్ పడాలి. వీళ్లు కూడా ఇదే అనుకున్నారేమో.. తమ సంబంధంపై ఓ క్లారిటీ ఇవ్వాలనుకున్నారట. నరేష్, పవిత్ర జీవిత గాథల ఆధారంగా ఓ అందమైన ప్రేమ కథ తెరకెక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటించే ఈ సినిమాలో తమ సహజీవనంపై క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగని ఇది వీళ్లిద్దరి బయోపిక్ మాత్రం కాదు.. పబ్లిక్ రూమర్స్‌కు చెక్‌పెట్టడానికి.. సోషల్‌మీడియాకు క్లారిటీ కంటెంట్ ఇవ్వడానికి ఫిక్సయ్యారట.
వీరిద్దరి సహజీవనాన్నే సినిమాగా చూపించబోతున్నారని.. అందులో కొంత ఫిక్షన్‌ను కూడా జోడించనున్నట్లు సమాచారం. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు.. అయితేనేం.. ఈ మాత్రం ఉప్పందితే..ఉప్పెనే కదా.. అసలు తమ జీవితాల్లో ఏం జరిగింది? ఎలా కలిశారు? ఎందుకు సహజీనం చేస్తున్నారన్న వివరాలను అందులో చెబుతారట.. తమ ప్రేమ బంధంపై మంచి లవ్ స్టోరీ మూవీతో అందరి నోళ్లు మూయిస్తామంటున్నారని టాలీవుడ్ టాక్..
రీసెంట్‌గా వీరిద్దరు అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే సినిమాలో నటించారు. అతడి భార్య పాత్రలో పవిత్ర ఒదిగిపోయారు. దీంతో.. నరేష్ పవిత్రతో నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు కూడా సోషల్‌మీడియా కోడై కూస్తోంది. అదీ సంగతి.. పాపం ఆయన ఫ్రెండ్ అంటుంటే..మీరేమో అదీ ఇదీ అని ఏదేదో చెబుతూ..వాళ్లను హర్ట్ చేస్తున్నారు. అర్థం చేసుకోరూ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..