Liger Movie: బాక్సింగ్ లెజెండ్‌తో సందడి చేస్తున్న లైగర్ టీమ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా లైగర్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

Liger Movie: బాక్సింగ్ లెజెండ్‌తో సందడి చేస్తున్న లైగర్ టీమ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Vijay Devarakonda

Updated on: Nov 17, 2021 | 1:05 PM

Liger Movie: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా లైగర్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరి. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి అనన్య పాండే టాలీవుడ్ కి ఒకే సారి పరిచయం కానున్నారు. విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఇక పూరి కూడా ఈ సినిమాను ఎక్కడ తగ్గకుండా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా కీలక పాత్రలో బాక్సింగ్ లెజెండ్ మైక్‌ టైసన్‌ కనిపించనున్నారు. మైక్‌ టైసన్‌ తో సన్నివేశాల చిత్రీకరణ కోసం లైగర్ టీమ్ అమెరికాలో వాలిపోయారు. అక్కడ విజయ్- మైక్ టైసన్ ల పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక షూటింగ్ సమయంలో మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిత్ర బృందం. విజయ్, అనన్య, ఛార్మి తమ సోషల్ మీడియాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక విజయ్‌, పూరీలు కలిసి వేగాస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ రెస్టారెంట్‌తో పాటు కొన్ని లొకేషన్స్‌లో ఫోటోలు దిగారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. లైగర్‌ చిత్రాన్ని.. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కౌర్ – కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh : ఈ సినిమాలో చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయన్న విక్టరీ వెంకటేష్..

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

Loading...
Unable to load recommendations.
Follow Us