Chiranjeevi:మెగాస్టార్ మంచి మనసుకు మరో నిదర్శనం..సీనియర్ జర్నలిస్టు ఆస్పత్రి బిల్లు మొత్తం కట్టేసిన చిరంజీవి

చిరంజీవి సేవా కార్యక్రమాలు, దాన ధర్మాల గురించి మనకు తెలిసింది కొంతేనని, ఎవరికీ తెలియని గుప్త సహాయాలు చాలా ఉన్నాయని ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తెలిపారు. అన్నయ్య ఆపద్భాందవుడని ప్రశంసలు కురిపించారు. దీనిని నిరూపిస్తూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్.

Chiranjeevi:మెగాస్టార్ మంచి మనసుకు మరో నిదర్శనం..సీనియర్ జర్నలిస్టు ఆస్పత్రి బిల్లు మొత్తం కట్టేసిన చిరంజీవి
Megasta Chiranjeevi
Follow us

|

Updated on: Aug 25, 2024 | 6:17 PM

మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. చిరంజీవి సేవా కార్యక్రమాలు, దాన ధర్మాల గురించి మనకు తెలిసింది కొంతేనని, ఎవరికీ తెలియని గుప్త సహాయాలు చాలా ఉన్నాయని ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తెలిపారు. అన్నయ్య ఆపద్భాందవుడని ప్రశంసలు కురిపించారు. దీనిని నిరూపిస్తూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఓ సీనియర్ జర్నలిస్టుకు ఆపన్న హస్తం అందించారు. ఆస్పత్రిలో ఒక్క రూపాయి కట్టనివ్వకుండా అన్నీ తానై చూసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ప్రముఖ సీనియర్‌ సినిమా జర్నలిస్టు సుబ్బారావు ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా చికిత్స ప్రారంభించారు. అయితే వైద్యం జరుగుతన్న సమయంలో ఆయనకు మధుమేహం‌ ఉందనే విషయం బయటపడింది. మూడు నెలల క్రితం తనకు డయాబెటిస్ వచ్చిందని సుబ్బరావు చెప్పారు. ఆ ఆసుపత్రి వైద్యులు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు. అయితే డాక్యుమెంట్స్ పరిశీలించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ టీమ్‌ సుబ్బారావు క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది. డయాబెటిస్ ఉందనే కారణంతో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను రిజెక్ట్ చేసినట్లు టీమ్ తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక సినిమా మీడియాలో ఉన్న స్నేహితులందరితోనూ మాట్లాడారు సుబ్బారావు. అదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో ఉన్న పరిచయంతో ఆయనకు ఓ మెసేజ్ చేశారు. అందులో తన పరిస్థితి గురించి వివరించారు.

సుబ్బారావు మెసేజుకు వెంటనే స్పందించారు చిరంజీవి. వెంటనే ఫోన్ చేసి ‘ఏమైంది సుబ్బారావు? అసలు ఆ విషయాలన్నీ నువ్వు వదిలేశాయ్‌. నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తున్నా. నువ్వు డిశ్చార్చి అయి ఇంటికి వెళ్లిపో. మిగతా వన్నీ చూసుకుంటాను’ అని చెప్పారట. అలా చిరంజీవి హామీతో వెంటనే సుబ్బారావు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారట.

ఇవి కూడా చదవండి

మన అనుకుంటే ఎంతైనా..

తాజాగా మెగాస్టార్ చేసిన సహాయాన్నిఅందరితో పంచుకున్నారు సుబ్బారావు. రెండు లక్షల రూపాయలకు పైగా అయిన ఆస్పత్రి బిల్లును మొత్తం మెగాస్టారే చెల్లించారని అందులో పేర్కొన్నారు. ‘పుట్టిన రోజు వేడుకలు, తిరుమల ప్రయాణం… ఇలా బిజీ బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి నా మెసేజ్‌కు వెంటనే స్పందించారు. మన మనుషులు అని ఆయన అనుకుంటే ఎంతైనా కేర్ తీసుకుంటారు. ఇందుకు నా విషయమే ఉదాహరణ. ఆయన మంచితనానికి హ్యాట్సాఫ్‌’ అని ఎమోషనల్ అయ్యారు సుబ్బారావు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీనియర్ జర్నలిస్టు ఆస్పత్రి బిల్లు మొత్తం కట్టేసిన చిరంజీవి
సీనియర్ జర్నలిస్టు ఆస్పత్రి బిల్లు మొత్తం కట్టేసిన చిరంజీవి
బంగ్లాపై ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. పాక్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
బంగ్లాపై ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. పాక్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
తుపాకీతో పాఠశాలకు వచ్చిన బాలుడు.. పరుగులు పెట్టిన విద్యార్థులు..
తుపాకీతో పాఠశాలకు వచ్చిన బాలుడు.. పరుగులు పెట్టిన విద్యార్థులు..
ఆర్మాక్స్ టాప్ సెలబ్రిటీగా సెలెక్ట్ అయిన ప్రభాస్.!
ఆర్మాక్స్ టాప్ సెలబ్రిటీగా సెలెక్ట్ అయిన ప్రభాస్.!
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
హడలెత్తిస్తున్న హైడ్రా.. అఫీషియల్ రిపోర్ట్ ఇదే..
హడలెత్తిస్తున్న హైడ్రా.. అఫీషియల్ రిపోర్ట్ ఇదే..
లంగావోణిలో జగతి మేడమ్ స్టన్నింగ్ లుక్స్..
లంగావోణిలో జగతి మేడమ్ స్టన్నింగ్ లుక్స్..
టీ20, వన్డేల్లో ఒక్క సిక్స్ కొట్టని ముగ్గురు భారత ఆటగాళ్లు..
టీ20, వన్డేల్లో ఒక్క సిక్స్ కొట్టని ముగ్గురు భారత ఆటగాళ్లు..
జైలులో దర్శన్‌కు రాజ భోగాలు!దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన హీరో
జైలులో దర్శన్‌కు రాజ భోగాలు!దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన హీరో
వాళ్లూ, వీల్లూ అని లేకుండా అందరికి ఇచ్చిపడేసిన చెర్రీ. ఎలాగంటారా?
వాళ్లూ, వీల్లూ అని లేకుండా అందరికి ఇచ్చిపడేసిన చెర్రీ. ఎలాగంటారా?
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు