Ravi Teja: జోరు పెంచిన మాస్ మహారాజ్.. తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన రవితేజ..

వరుస సినిమాలతో జోరుమీదున్న మాస్ రాజా ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఫ్లాప్‌‌లతో సతమతం అయిన రవితేజ ఇటీవలే క్రాక్ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చారు.

Ravi Teja: జోరు పెంచిన మాస్ మహారాజ్.. తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన రవితేజ..
Mass Raja Ravi Teja

Updated on: Oct 31, 2021 | 5:13 PM

Ravi Teja: వరుస సినిమాలతో జోరుమీదున్న మాస్ రాజా ఆయా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఫ్లాప్‌‌లతో సతమతం అయిన రవితేజ ఇటీవలే క్రాక్ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చారు. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టారు ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. అలాగే రామారావు ఆన్ డ్యూటీ  అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. రవితేజ నటించనున్న 70వ సినిమా ఇది. స్వామిరారా ఫేం సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. నవంబర్ 5న ఈ సినిమా టైటిల్- ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఈసినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అన్న క్యాప్షన్‌ని ఇచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌నే సుధీర్ వర్మ ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 70వ మూవీగా రానుంది.

Raviteja

Loading...
Unable to load recommendations.
Follow Us