
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటుండగా.. పరిస్థితులు రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పలు దేశాల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై మిస్సైల్స్ దాడి చేస్తుంది. దీంతో దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. మరోవైపు విమాన సర్వీసులు సైతం నిలిపివేయడంతో అక్కడ పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీప్రముఖులు దుబాయ్ లో చిక్కుకుపోయారు. అందులో హీరో మంచు విష్ణు ఫ్యామిలీ సైతం అక్కడే ఉంది. అదే సమయంలో ఆకాశంలో దూసుకోస్తున్న మిస్సైల్స్ వీడియోను షేర్ చేశారు మంచు విష్ణు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..
ప్రస్తుతం దుబాయ్ లో మంచు విష్ణు ఫ్యామిలీ ఉన్నారు. ఇరాన్ దాడి చేసిన క్షిపణి దెబ్బకు తాను నివసిస్తున్న ఇల్లు షేక్ చేయిందని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆకాశంలో దూసుకోస్తున్న ఇరాన్ మిస్సైల్స్ వీడియో పంచుకున్నారు. ఆ క్షిపణుల భారీ శబ్దాలు తన కుమార్తె ఐరాను భయపెట్టాయని అన్నారు. ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఎవరూ పెరగకూడదని అన్నారు. శాంతి కోసం ప్రార్థిస్తు్న్నానని పేర్కొన్నారు. “ఈ రాత్రి దుబాయ్ లో కుటుంబ సభ్యులతో ఉన్నాను. ఆకాశంలో కనిపిస్తున్న క్షిపణుల వల్ల మేము ఉన్న ఇల్లు కంపించింది. ఆ శబ్దాలకు ఐరా చాలా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఈ రక్షణ దశాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో గుర్తుచేస్తాయి. బలం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హార్ హార్ మహాదేవ్” అంటూ పేర్కొన్నారు మంచు విష్ణు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.
Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.
Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026
మరోవైపు భారత స్టార్ షట్లర్ PV సింధు సైతం దుబాయ్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో పరిస్థితులపై పీవీ సింధు ట్వీట్ చేసింది. “ఎయిర్‌పోర్ట్ దగ్గరలో బాంబులు పడ్డాయి. కోచ్ సహా తామంతా పరుగులు తీశాము. భయానక పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం మేమంతా సురక్షితంగా ఉన్నాం. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, అథారిటీకి థ్యాంక్స్. ఇండియన్ హై కమిషన్ తమ భద్రపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. త్వరగా పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నాము” అంటూ సింధు ట్వీట్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
The ordeal continues to unfold, and the situation is becoming more frightening by the hour.
A few hours ago, there was an explosion close to where we were holed up at the airport. My coach had to quickly run out of the area as he was closest to the smoke and debris. It was an… https://t.co/ZdNtuALk0P
— Pvsindhu (@Pvsindhu1) March 1, 2026
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..