Manchu Vishnu: మంచువారబ్బాయి గొప్ప మనసు.. 120 మంది అనాథలను తీసుకున్న విష్ణు.. ప్రశంసల జల్లు

|

Jan 14, 2025 | 8:39 AM

సంక్రాంతి పర్వదినాన మంచు విష్ణు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై ఈ పిల్లల విద్య, వైద్యం, వసతి తదితర బాధ్యతలు తనవేనన్నాడు. దీంతో మంచు వారబ్బాయిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Manchu Vishnu: మంచువారబ్బాయి గొప్ప మనసు.. 120 మంది అనాథలను తీసుకున్న విష్ణు.. ప్రశంసల జల్లు
Manchu Vishnu
Follow us on

మా అధ్యక్షులు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన సొంత జిల్లా తిరుపతిలోని బైరాగిపట్టెడలోని మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు మంచు వారబ్బాయి. ఒక కుటుంబ సభ్యుడిలా వారికి అన్ని విషయాల్లోనూ అండగా, తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. సోమవారం (జనవరి 13) మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు, విష్ణు పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి భోగి మంటలు వేశారు. వారికి ఆట వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘
120 మంది చిన్నారులకు విద్య, వైద్యంతో పాటు ఒక కుటుంబసభ్యుడిలా తోడుంటానని భరోసా ఇచ్చారు. ‘కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అయితే నేను చేసిన మంచి పనిని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. మంచి మనసుతో మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి అనాథలను ఆదరిస్తున్నారు. ఇప్పుడీ సంస్థకు పెద్దన్నగా తోడుంటాను. ఇప్పటి నుంచి వీరంతా నా కుటుంబసభ్యులే
.పిల్లలతో సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వారి విద్యా వసతికి సంబంధించి పూర్తి బాధ్యత కూడా మాదే ‘ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

తాను చేస్తోన్న మంచి పనికి అందరి సహాకారం కావలని మంచు విష్ణు కోరారు ‘ నేను ప్రారంభించిన ఈ పనిలో మీ సహాకారం కూడా ఉంటే బాగుంటుంది. అవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి మంచి పనులు చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. మీరు కూడా మీకు సమీపంలో ఉన్న అనాథ పిల్లలన్ని దత్తత తీసుకుని సాయం చేయండి’ అని మంచు వారబ్బాయి పిలుపునిచ్చారు. మంచు విష్ణు ప్రకటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మంచు వారబ్బాయిపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న కన్నప్ప సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కన్నప్ప సినిమాలో కాజల్ లుక్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.