Tollywood: అప్పుడు స్కూల్లో టాపర్.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. హిట్స్ వచ్చినా కలిసిరాని అదృష్టం..

|

Jan 14, 2025 | 8:39 AM

సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. చిన్నప్పుడు స్కూల్లో ఆ అమ్మాయి టాపర్. ఇప్పుడు ఇండస్ట్రీలోనూ వరుస హిట్స్ అందుకుంటూ సత్తా చాటింది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలతో నెట్టుకొస్తుంది.

Tollywood: అప్పుడు స్కూల్లో టాపర్.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. హిట్స్ వచ్చినా కలిసిరాని అదృష్టం..
Actress
Follow us on

సినీరంగంలో హీరోయిన్ గా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఎన్నో కష్టాలను, సవాళ్లను, అవమానాలను ఎదుర్కొని నటిగా కొనసాగాల్సి ఉంటుంది. అలాగే ఆనపకాయ అంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసినా కొందరికి అవకాశాలు రావు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి మాత్రం అందుకు మినహాయింపు. తెలుగు చిత్రపరిశ్రమలో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. టాప్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్ని సూపర్ హిట్. తెలుగులో వరుసగా విజయాలను అందుకున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన ఆఫర్స్ మాత్రం రావడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా ఓరేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఫిల్మ్ రంగంలో సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ సంయుక్త మీనన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో సెకండ్ హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో మరో హిట్ అందుకుంది. దీంతో తెలుగులో సంయుక్తకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ హీరోయిన్ అన్న ట్యాగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత సంయుక్త చేతిలో మరో సినిమా లేనట్లు తెలుస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో సంయుక్తకు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది. పాఠశాలలో చదువుతున్న రోజుల్లో సంయుక్త స్కూల్‌ టాపర్ అట. గతంలోనూ సంయుక్త స్కూల్ ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. చివరిసారిగా కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ఇటీవల వచ్చి లవ్ మీ చిత్రంలో కామియో రోల్ చేసింది. ఇప్పుడు స్వయంభూ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. అలాగే మలయాళం, తమిళంలో ఆఫర్స్ అందుకుంటుందట.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..