Actress: పెళ్లైన ఏడేళ్లకు గర్భం.. బేబీ బంప్‌పై మెహందీ డిజైన్ వేయించుకున్న ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్

పెళ్లైన అమ్మాయిలందరూ వెంటనే తల్లి కావాలని ఆరాటపడతారు. ఓ పండంటి బిడ్డను కని అమ్మతనం పొందాలని ఎదురుచూస్తుంటారు. అలా మాతృత్వం కోసం ఈ నటి ఏడేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆమె కల సాకరమైంది. త్వరలోనే ఈ అందాల తార ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

Actress: పెళ్లైన ఏడేళ్లకు గర్భం.. బేబీ బంప్‌పై మెహందీ డిజైన్ వేయించుకున్న ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
Preetha Pradeep

Updated on: Feb 20, 2026 | 6:55 AM

మలయాళ ప్రముఖ నటి ప్రీత ప్రదీప్‌ త్వరలో తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆమె తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉంది. మరికొద్ది రోజుల్లో ఓ పండంటి బిడ్డ ఆమె కుటుంబంలో భాగం కానుంది. గర్భం ధరించినప్పటి నుంచి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోతున్న ప్రీత తాజాగా తన బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసింది. అందులో తన పొట్టపై మెహందీ డిజైన్ ఉంది. కమలం పువ్వుపై తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లుగా ఈ డిజైన్‌ ఉంది. ఈ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్న ప్రీత.. మా జీవితంలోకి కొత్త వెలుగు రాబోతోంది. మాతృత్వం అంటే ప్రేమ దాని అత్యంత పేద రూపాన్ని సంతరించుకుని శ్వాసతో ప్రారంభమవుతుంది. ఈ రోజు, నాలో పెరుగుతున్న అద్భుతాన్ని నేను జరుపుకొంటున్నాను”‘ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రీతా ప్రదీప్ కు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

కేరళలోని తిరువనంతపురంకు చెందిన ప్రీత వివేక్ ను వివాహం చేసుకుంది. 2019 ఆగస్టు 25న వీరి వివాహం జరిగింది. ఇప్పుడు పెళ్లయిన ఏడేళ్లకు తొలిసారి పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనుండడంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.

బేబీ బంప్ తోమలయాళ నటి ప్రీతా ప్రదీప్..

కాగా ప్రీత ప్రదీప్‌ మలయాళంలో ప్రముఖ నటిగా వెలుగొందుతోంది. కురుక్కు, సండే హాలీడే, ప్రేమసూత్రం, ఉయరే వంటి పలు సినిమాల్లో నటించిందీ అందాల తార. అలాగే బుల్లితెరపై ఓ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌ పోషించింది. యాంకర్‌, డ్యాన్సర్‌గానూ ప్రీత మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us