Malavika Mohanan: నా పెళ్ళికి మీకు తొందరెందుకు.. నా కోరిక అదే.. ఓపెన్‌గా చెప్పేసిన మాళవిక

|

Aug 01, 2024 | 9:30 AM

త్వరలోనే నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తంగలాన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ పాత్రలో నటిస్తుంది. మలయాళం సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ. పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది.

Malavika Mohanan: నా పెళ్ళికి మీకు తొందరెందుకు.. నా కోరిక అదే.. ఓపెన్‌గా చెప్పేసిన మాళవిక
Malavika Mohanan
Follow us on

అందాల భామ మాళవిక మోహనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు డబ్బింగ్ మూవీస్ ద్వారా పరిచయం అయ్యింది. త్వరలోనే నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తంగలాన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ పాత్రలో నటిస్తుంది. మలయాళం సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ. పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులోకి డబ్ అయ్యింది. ఆతర్వాత దళపతి విజయ్ మాస్టర్. ధనుష్ మారన్ సినిమాలతో అలరించింది. ఇక ఇప్పుడు తంగలాన్‌ సినిమాతో రానుంది.

తంగలాన్‌ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది మాళవిక. నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు.? అంటూ కౌంటర్ ఇచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతూ.. తంగలాన్ సినిమా అదిరిపోతుంది అని తెలిపింది. హీరో విక్రమ్ గురించి మాట్లాడుతూ.. విక్రమ్‌ అందరితో ఫ్రెండ్లీగా  ఉంటారు. ‘తంగలాన్‌’ కోసం నేను మొదటిసారి స్టంట్స్‌ చేశా.దానికి విక్రమ్‌ చాలా సాయం చేశారు. నటన విషయంలో సహ నటులకు ఎంతో సాయం చేస్తాడు ఆయన.

అలాగే  గ్యాంగ్‌స్టర్‌గా నటించడం నా కోరిక అంటూ తన మనసులో మాట బయట పెట్టింది. నటనతో పాటు ఎప్పుడూ ఫైట్‌ చేయడమే ఇష్టం అని చెప్పుకొచ్చింది మాళవిక. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు.

మాళవికామోహనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..