
సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రూ అవుట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ ఫిల్మ్ స్టార్ గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ స్థాయిలో.. జక్కన్న అప్ కమింగ్ సినిమాతో హాట్ టాపిక్ అవుతున్నాడు. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ గా రిలీజ్ కానుంది.
ఇక ఈ క్రమంలోనే కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తరం సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మహేష్ పిల్లలు గౌతమ్.. సితార సినిమాల్లోకి తొందర్లో రావడం పక్కా అనే టాక్ వస్తోంది. ఇక వీరితో పాటు సుధీర్ బాబు అబ్బాయి కూడా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే ఇప్పుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస మంగాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు జయకృష్ణ.
అయితే ఈ వీరి మీద కాకండా ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల అమ్మాయి మీద అందరి ఫోకస్ పడింది. ఎప్పుడూ మీడియాకు అంతగా కనిపించని మంజుల కూతురు జాహ్నవి.. ఇటీవల ఇన్‌స్టా గ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ చిన్నది ఓ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. దీంతో కృష్ణ, మహేష్ ఫ్యాన్స్‌తో పాటు.. అందరి ఫోకస్ ఈ బ్యూటీపై పడింది. జాహ్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం ఎక్కువైంది. అంతేకాదు జాహ్నవి హీరోయిన్ అవడం పక్కా అనే కామెంట్స్ తెగ వినిపిస్తున్నాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.