Anantha Sriram: ఆ పాట వెనుక రహస్యం ఇదే.. అనంత శ్రీరామ్ స్పెషల్ ఇంటర్వ్యూ..

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్, సక్సెస్ ఫుల్ లిరిసిస్ట్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు 'అనంత శ్రీరామ్'. తన కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా టీవీ9 (TV9) నిర్వహించిన "మైక్ పై చర్చ" (Mike Pe Charcha) అనే పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో అనంత శ్రీరామ్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Anantha Sriram: ఆ పాట వెనుక రహస్యం ఇదే.. అనంత శ్రీరామ్ స్పెషల్ ఇంటర్వ్యూ..
Anantha Sriram

Updated on: Apr 19, 2026 | 7:45 PM

సాధారణంగా ఒక హిట్ పాట వెనుక ఎంతో కష్టం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే అనంత శ్రీరామ్ అభిప్రాయం ప్రకారం, దర్శకుడు, నిర్మాతలు సంతృప్తి చెందేలా రాయడానికి కృషి అవసరమే కానీ, ఎటువంటి ఒత్తిడి లేకుండా సహజంగా వచ్చే పాటే నిజమైన అద్భుతమైన పాట అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయన రాసిన ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇలాగే పుట్టాయని వెల్లడించారు. తన పాటలు ప్రేమికులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయంపై స్పందిస్తూ, ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో ఒక జంట తన దగ్గరకు వచ్చి, తమ మధ్య ప్రేమ చిగురించడానికి, బంధం బలపడటానికి ఆయన రాసిన పాటలే కారణమని చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ముఖ్యంగా “ఏమాయ చేసావే” వంటి సినిమాల్లోని పాటలు నేటి యువతకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రయాణం గురించి అనంత శ్రీరామ్ చెప్పిన మరిన్ని ముచ్చట్లు తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోను చూడండి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

Loading...
Unable to load recommendations.
Follow Us