దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ లవర్ బాయ్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). రౌడీ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకు యూత్‌లో యమ ఫాలోయింగ్ ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్.. ఇప్పుడు లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. లైగర్ విడుదలకు ముందే విజయ్‌కు బాలీవుడ్ లో అభిమానులు పెరిగిపోయారు. ముఖ్యంగా బీటౌన్ హీరోయిన్స్ విజయ్ పై మనసు పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాఫీ విత్ కరణ్ జోహార్ షోలోనూ సారా అలీ ఖాన్ విజయ్ తో డేటింగ్ కు వెళ్లాలని ఉందంటూ ఓపెన్ అయ్యింది. అయితే విజయ్ ప్రేమ, పెళ్లి గురించి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు విజయ్.
ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోలో విజయ్, అనన్యను తన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలతో ఓ ఆటాడుకున్నాడు కరణ్. ఈ క్రమంలోనే తన రిలేషన్ షిప్ స్టేటస్ పై స్పందించాడు రౌడీ.
“నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే రోజు నేనే గట్టిగా చెబుతాను. అప్పటివరకు నన్ను ప్రేమించేవారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. నటుడిగా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ.. నా పోస్టర్స్ వారి ఇంట్లో పెట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు. నా ఫోటోస్ వారి మొబైల్ స్క్రీన్స్ పై ఉన్నాయి. వారెప్పటికీ నాకు ప్రేమను, అభిమానాన్ని, గౌరవం ఇస్తారు. నేను వారి గుండెను ముక్కలు చేయాలనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఇందుకు సంబంధించి ఎపిసోడ్ జూలై 28న రాత్రి 7 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.