Legend Saravanan: నెక్స్ట్ సినిమాలో మేకప్ లేకుండా కనిపిస్తా.. రెడీగా ఉండండి

|

Sep 16, 2024 | 7:18 PM

ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఈ శరవణన్. తన బ్రాండ్స్‌కు తానే మోడల్ గా మారి యాడ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. స్టార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో..

Legend Saravanan: నెక్స్ట్ సినిమాలో మేకప్ లేకుండా కనిపిస్తా.. రెడీగా ఉండండి
Legend Saravanan
Follow us on

లెజెండ్ శరవణన్.. ఈయన చాలా ఫెమస్ గురూ.. చాలా మందికి ఈయన గురించి తెలిసే ఉంటుంది.  50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నాడు హీరో శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఈ శరవణన్. తన బ్రాండ్స్‌కు తానే మోడల్ గా మారి యాడ్స్ చేస్తూ పాపులర్ అయ్యాడు. స్టార్ హీరోయిన్స్ తో కలిసి యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డాడు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్తో.. థియేటర్లలో రిలీజ్‌ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నాడు. లెజెండ్ శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆయన, ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తరగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హెరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తుందని తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా ఆండ్రియా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నెక్స్ట్ సినిమాలో తాను మేకప్ లేకుండా కనిపిస్తాను అని చెప్పాడు. అలాగే రగడ లుక్ లో ఆ సినిమాలో కనిపిస్తాను అని చెప్పుకొచ్చాడు లెజెండ్ శరవణన్. అలాగే కంటెంట్ ఓరియెంటడ్ సినిమా. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఆ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని తెలిపాడు లెజెండ్ శరవణన్.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.