లెజెండ్ శరవణన్ మొన్నా మధ్య ఈ పేరు తెగ హల్ చల్ చేసింది. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఐదుపదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు లెజెండ్ శరవణన్. హీరో అవ్వాలనే కలను చాలా ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే ఈ సినిమా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. తన సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు శరవణన్ ఇష్టపడలేదని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఇప్పటికే కాశ్మీర్లో కొంతమేర పూర్తి చేసుకున్నట్టు టాక్.
ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు. తాజాగా శరవణన్ కాశ్మీర్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.