కళ్లా అవి కళావతి కల్లోలమైందే మా గతి.. నిషా చూపుల ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

|

Mar 17, 2022 | 3:56 PM

హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం తమ అభిమన హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్.

కళ్లా అవి కళావతి కల్లోలమైందే మా గతి.. నిషా చూపుల ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?
Photo
Follow us on

హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం తమ అభిమన హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఇక హీరోయిన్స్ చిన్న నాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక హీరోయిన్ రేర్ ఫోటోలు అయితే చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందమంతా కళ్ళలోనే నింపుకుంది ఈ వయ్యారి భామ. పట్టు పరికినిలో అచ్చ తెలుగమ్మాయిలా మెరిసిపోతున్న ఈ చిన్నది మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఒకే ఒక్క సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

మొదటి సినిమాతోనే అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెలకు గాలాలు వేసింది ఈ బ్యూటీ. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ తొలి సినిమాలోనే ఏమాత్రం మొహమాట పడకుండా అందాలు ఆరబోసి రెచ్చిపోయింది. ఆర్ ఎక్స్ 100 సినిమా మంచి విజయం సాధించడం తో ఈ అమ్మడు తెలుగులో దూసుకుపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఈ మూవీతర్వాత ఆర్డీ ఎక్స్ అనే సినిమా చేసింది. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే సీనియర్ హీరో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాలో అవకాశం అందుకుంది ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆతర్వాత ఈ అమ్మడు కెరీర్ నెమ్మదించింది. ప్రస్తుతం కుర్ర హీరో ఆది సాయి కుమార్ తో ఓ సినిమా చేస్తుంది.

Payal Rajput