Trending Song: 30 ఏళ్లుగా ట్రెండింగ్.. 90’s యూత్ కుర్రాళ్ల ప్రేమలకు కలిసొచ్చిన పాట మావ.. తరాలు మారిన అదే క్రేజ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో 90's యూత్, 90's కిడ్స్ కు సంబంధించిన విషయాలు తెగ వైరలవుతున్నాయి. అలాగే అప్పటి కుర్రకారు ప్రేమ కూడా ప్రత్యేకమే. సెల్ ఫోన్ లవ్ స్టోరీస్ కాదు భయ్యా.. కాగితం ప్రేమలు.. అందమైన అక్షరాల్లో దాగిన మనసు మాటలు. అయితే ఇప్పుడు అప్పటి కుర్రాళ్లు తమ ప్రేమ కోసం పాడిన పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు 30 ఏళ్లుగా ఓ పాట అందరి హృదయాలు దోచుకుంటుంది.

Trending Song: 30 ఏళ్లుగా ట్రెండింగ్.. 90s యూత్ కుర్రాళ్ల ప్రేమలకు కలిసొచ్చిన పాట మావ.. తరాలు మారిన అదే క్రేజ్..
Oh Cheliya Naa Priya Sakhiya Song

Updated on: Jul 14, 2026 | 8:38 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. అలాగే అనేక పాటలు సైతం శ్రోతల మనసులు దోచుకున్నాయి. అలాంటి పాటలలో ఇప్పుడు మనం మాట్లాకుంటున్న సాంగ్ ఒకటి. ఆ పాట విడుదలై 30 సంవత్సరాలు అయ్యింది. అయినా ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. మనసును హత్తుకునే మధురమైన పాట ఏదో మీకు తెలుసా? డైరెక్టర్ శంకర్ ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన ‘కాదలన్’ చిత్రం. దీనిని తెలుగులో ప్రేమికుడు పేరుతో రిలీజ్ చేశారు. 1994లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో నగ్మా కథానాయికగా నటించారు. వడివేలు హాస్యనటుడిగా కనిపించగా.. హీరో తండ్రిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఆ సినిమాలో “ఓ చెలియా నా ప్రియ సఖియా.. చేజారిను నా మనసే.. ” అంటూ సాగే మెలోడీ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ అభిమానుల ప్లేలిస్ట్‌లో ఉంది. ఈ పాటకు వైరాముత్తు సాహిత్యం అందించారు. ఉన్నికృష్ణన్ హృద్యమైన గాత్రం ఈ పాటకు మరింత జీవం పోసింది. విరహం, వియోగం , ప్రేమ భావాలను చాలా సరళమైన పదాలలో వ్యక్తపరుస్తూ, ఈ పాట విడుదలైన రోజు నుంచే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాట కలిగించే వర్ణనాతీతమైన , గాఢమైన భావన, తరతరాల వారిని ఆస్వాదించేలా చేస్తుంది. డిజిటల్ యుగంలో కూడా ఈ పాట ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

యూట్యూబ్, సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్‌లలో లక్షలాది మంది అభిమానులు ఈ పాటను వింటూనే ఉన్నారు. ఇప్పటికీ అందరి గొంతులలో ఈ పాట వినిపిస్తూనే ఉంది.’, వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే.. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే’, ‘ఇది స్వర్గమా.. లేక నరకమా, నువ్వు చెప్పినట్లు.. ఈ జీవికి జీవనమరణము నీ చేతిలొ ఉన్నదిలే… ఓ చెలియా నా ప్రియసఖియా చేజారెను నా మనసే’ వంటి చరణాలు వైరముత్తు ప్రేమ కోసం తన ఆరాటాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఈ పాట అందరి మనసులు గెలుచుకుంటుంది. ఇంతకీ ఈ సాంగ్ మీరు విన్నారా.. ? అయితే ఒకసారి వినండి.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఓ చెలియా సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Loading...
Unable to load recommendations.
Follow Us