Actor : 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాసిన కమెడియన్.. నేషనల్ అవార్డ్ గెలిచిన ఈ నటుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సినీరంగంలో హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. హాస్య నటీనటులు సైతం ఎంతో పాపులర్ అవుతుంటారు. వెండితెరపై తమ నటనతో, కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తుంటారు. అయితే తెరపై కనిపించినట్లుగా తమ జీవితాలు మాత్రం సాగవు. ఈ నటుడు మాత్రం ఎంతో మందికి ఆదర్శం. 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాసిన నటుడి గురించి మీకు తెలుసా.. ?

Actor : 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాసిన కమెడియన్.. నేషనల్ అవార్డ్ గెలిచిన ఈ నటుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Indrans

Updated on: Apr 21, 2026 | 4:37 PM

చదువుకు వయసు అడ్డంకి కాదని చాలామంది నిరూపించారు. ఆ విషయంలో జాతీయ అవార్డు గ్రహీత అయిన పాపులర్ నటుడు సైతం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. దాదాపు 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాశారు. సినిమాకు అతీతంగా చదువుపై ఆయనకు ఉన్న ఆసక్తి గురించి తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనం మాట్లాడుకుంటున్న నటుడి పేరు ఇంద్రన్స్. 1981లో మలయాళ చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలలో సహాయ నటుడిగా నటించారు. హాస్య పాత్రలలో అద్భుతమైన నటన కనబరచి ఇంద్రన్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనకు తమిలం, మలయాళం భాషలలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

ఇంద్రన్స్ మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నేటి యువ దర్శకులకు ఆయనే మొదటి ఎంపిక. 40 ఏళ్ల తన కెరీర్‌లో, ఇంద్రన్స్ 2021లో ‘హోమ్’ అనే మలయాళ చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో, సూర్య కథానాయకుడిగా నటించిన ‘కరుప్పు’ చిత్రంలో ఇంద్రన్స్ నటించారు. ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. ఇది ఆయనకు తొలి తమిళ చిత్రం. పేద కుటుంబంలో జన్మించిన ఇంద్రన్స్, చిన్న వయసులోనే చదువు మానేసి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

“నేను స్కూల్లో ఉన్నప్పుడు, పుస్తకాలు, యూనిఫారాలు కొనడానికి డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే చదువు మానేశాను. అప్పట్లో నేను ఎప్పుడూ మొదటి ర్యాంకు తెచ్చుకునేవాడిని. అందుకే నేను మంచి విద్యార్థిని కావడంతో వాళ్లు నన్ను మొదటి బెంచీలో కూర్చోబెట్టేవారు. కానీ పేదరికం వల్ల నేను నా చదువును కొనసాగించలేకపోయాను. మా కుటుంబంలోని పేదరికం కారణంగా నేను చదువు మానేశాను. మా కుటుంబంలో ఏడుగురు పిల్లలం. నేను మూడవ అబ్బాయిని” అని ఇంద్రన్స్ ఓ ఇంటర్వ్యులో అన్నారు.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

ప్రస్తుతం తన ఆర్థిక స్థితి బాగుంది. దీంతో తన చదువును ఎలాగైనా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. 68 ఏళ్ల వయసులో 2024లో 7వ తరగతి పరీక్ష రాశారు. కేరళ రాష్ట్ర అక్షరాస్యతా కమిషన్ ద్వారా ఆయనకు ఈ అవకాశం లభించి, తన కలను సాకారం చేసుకున్నారు. ఇంద్రన్స్ 10వ తరగతి పరీక్ష రాయాలనుకున్నారు. కానీ, 7వ తరగతి పరీక్ష పూర్తి చేసి, సర్టిఫికేట్ పొందకుండా ఆయన 10వ తరగతి పరీక్ష రాయలేరు. 70 ఏళ్ల ఇంద్రన్స్ ఇకపై తన చదువుపై దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Indrans

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

Follow Us