మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో చిరు ఎత్తుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కుమారుడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.
మొదటి సినిమాలో నటన, డ్యాన్స్, ఫైట్ స్కిల్స్ చూసి టాప్ హీరో రేంజ్ కు వెళ్తాడని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులతో క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. కెరీర్ పూర్తిగా ఒడిదుడుకులతో సాగింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..? అతడు మరెవరో కాదండి.. స్టార్ హీరో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. 2011లో ప్రేమ కావాలి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ మూవీతోనే అవార్డ్స్ సైతం అందుకున్నాడు.
ఆ తర్వాత లవ్లీ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. కానీ ఆ తర్వాత ఆది సాయి కుమార్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో నెమ్మదిగా సినిమాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు ఆది సాయి కుమార్. ఈ క్రమంలోనే తాజాగా ఆది సాయి కుమార్ ను చిరు ఎత్తుకున్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో చిరంజీవి నటించిన కలికాలం సినిమా సమయంలోనిది అని సమాచారం. ఇందులో సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా తన తండ్రికి బదులుగా ఆది సాయి కుమార్ అవార్డ్ అందుకున్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.