
విక్టరీ వెంకటేశ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలకు మహిళలు, అమ్మాయిలు, ఫ్యామిలీ ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే ఆయన ఎంతో మంది హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశారు. హీరోయిన్ ఖుష్బూ, దివ్య భారతి, టబు, రేవతి ఇలా ఎంతో మంది తారలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ వెంకీతో నటించాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు కలలు కంటారు. కానీ వెంకటేష్ కెరీర్ లో ఓహీరోయిన్ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె వెంకీ సరసన ప్రియురాలిగా నటించడమే కాదు.. అంతకు ముందు వెంకీ కూతురిగానూ కనిపించింది. అంతేకాదు.. అప్పట్లో ఆమె సౌత్ కుర్రాళ్ల ఆరాధ్య దేవత. అప్పట్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ , క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం సృష్టించింది. ఇంతకీ వెంకీ కూతురిగా, ఆ తర్వాత ప్రియురాలిగా కనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు..దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. అవును.. వెంకీకి హీరోయిన్ శ్రీదేవి కూతురిగా ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రియురాలిగా కనిపించింది. అందుకే ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. ఇదిలా ఉంటే.. వెంకటేశ్ బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1972లో తమిళంలో వచ్చిన వసంత మాళిగై చిత్రాన్ని తెలుగులో ప్రేమ్ నగర్ పేరుతో రీమేక్ చేశారు. అయితే తమిళంలో ఈ సినిమాలో శివాజీ గణేషన్ ప్రధాన పాత్రలో నటించగా.. ఆయన సోదరుడిగా విజయ్ నటించారు. ఇదిలా ఉంటే.. విజయ్ చిన్ననాటి పాత్రలో హీరో వెంకటేశ్ కనిపించారు. ఇక శివాజీ గణేషన్ కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే వెంకీ పాత్ర పరంగా శ్రీదేవికి వెంకీ బాబాయ్ పాత్రలో కనిపించారన్నమాట.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణ క్షణం చిత్రంలో వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించారు. 1991లో విడుదలైన ఈ థ్రిల్లర్ డ్రామా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఇందులో వెంకీ, శ్రీదేవి కెమిస్ట్రీ జనాలకు తెగ నచ్చేసింది. వెంకీ కెరీర్ లోనే ఆయనకు కూతురిగా, తర్వాత ప్రియురాలిగా కనిపించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి కావడం విశేషం. ప్రస్తుతం వెంకటేశ్ ఓవైపు ఆదర్శ కుటుంబం చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
Sridevi
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..