Actor : పక్కటెముకలు విరిగినా.. కుండపోత వర్షంలో 28 మందితో పోరాడిన నటుడు.. తెలుగులో తోపు విలన్..

తెలుగులో ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయ్యాడు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలతో తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో కొనసాగుతున్నాడు. కానీ తెలుగులో మాత్రం అంతగా సినిమాలు చేయడం లేదు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ?

Actor : పక్కటెముకలు విరిగినా.. కుండపోత వర్షంలో 28 మందితో పోరాడిన నటుడు.. తెలుగులో తోపు విలన్..
Rahul Dev

Updated on: May 14, 2026 | 7:37 PM

మనం తెరపై యాక్షన్ సన్నివేశాలను చూడటాన్ని ఆస్వాదిస్తాం. కానీ అదే సన్నివేశానికి జీవం పోయడానికి ఒక నటుడు ఎంతగా కష్టపడతాడో మనకు తెలియదు. అలాంటి ఘటనలు చాలా సినిమాల సందర్భాల్లో జరిగాయి. సాధారణంగా తమకు గాయాలు అయినా.. ప్రమాదాలు జరిగినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా నటనపై మాత్రమే ఫోకస్ చేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఉన్నారు. అతడు ఇండస్ట్రీలో తోపు విలన్. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పేరు రాహుల్ దేవ్. శరీరంలోని ఎముకలు విరిగినప్పటికీ అతడు వెనకడుగు వేయలేదు. గత మూడు దశాబ్దాలుగా తన రూపంతో, శక్తివంతమైన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాహుల్ దేవ్, 2021లో వచ్చిన ‘ది ఎంపైర్’ అనే సీరియల్లో నటించారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఇందులో వజీర్ ఖాన్ పాత్రను పోషించారు. ఈ పాత్ర కోసం రాహుల్ కఠినమైన శిక్షణ తీసుకోవలసి వచ్చింది. అయితే గుర్రపు స్వారీ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది. అందులో రాహుల్ రెండు పక్కటెముకలు విరిగాయి. పక్కటెముకలు విరగడం కేవలం గాయమే కాదు.. దానివల్ల శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది ఏర్పడింది. ఈ అనుభవాన్ని రాహుల్ ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. “మన గుండె, ఊపిరితిత్తులు పక్కటెముకల లోపల సురక్షితంగా ఉంటాయి. పక్కటెముక కొద్దిగా విరిగినా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పక్కటెముక విరిగినప్పుడు, దానికి ప్లాస్టర్ వేయలేం, అలాంటి పరిస్థితిలో, మనం పొరపాటున తుమ్మినా కూడా మన శరీరం మొత్తం వణికిపోయి, మన జీవితం దుర్భరంగా మారుతుంది” అని రాహుల్ అన్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 40-42 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. మరోవైపు, ‘ది ఎంపైర్’ క్లైమాక్స్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోట్ల రూపాయల విలువైన సెట్‌ను నిర్మించారు. ఒకవేళ రాహుల్ దేవ్ లేకపోతే ప్రాజెక్టుకు భారీగా నష్టం వాటిల్లి ఉండేది. కానీ రాహుల్ కేవలం 10 రోజుల్లోనే సెట్ కు చేరుకున్నాడు. పక్కటెముకలలో భరించలేని నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఏకంగా 28 మందిని ఎదుర్కోవలసిన సన్నివేశాన్ని చిత్రీకరించాడు. మొత్తానికి శరీర నొప్పిని తట్టుకున్నప్పటికీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us