2024 ఏడాదికి ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం తెలుగు సినిమా రేంజ్ మరింత ఎత్తుకు ఎదిగింది. చిన్న సినిమాగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రాలు అనేకం ఉన్నాయి. పెద్ద స్టార్స్ లేకపోయిన కంటెంట్ తో అదరగొట్టిన చిత్రాలు అనేకం. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సత్తా చాటుతుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. అంతకు ముందు విడుదలైన కల్కి 2898 ఏడీ, దేవర వంటి సినిమాలు సైతం పాన్ ఇండియా లెవల్లో అరుదైన ఘనత సాధించాయి. ఈ ఏడాది తెలుగులో విడుదలైన సినిమాలు భారీగానే లాభాలు అందుకున్నాయి.
అయితే 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా. ? అసలు ఆ సినిమాకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందామా. తెలుగులో ఈ ఏడాది థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన చిత్రాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం దూసుకుపోతున్న పుష్ప 2 ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. హనుమాన్, కల్కి, దేవర, పుష్ప2 , టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, గుంటూరు కారం చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో వసూళ్లు సుమామీ సృష్టిస్తుంది పుష్ప 2. కేవలం హిందీలోనే రూ.645 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుని.. బాలీవుడ్ వందేళ్ల చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
పుష్ప 2 సినిమాకు అటు ఇటుగా రూ.500 కోట్లుపైగానే బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే రూ.150-200 శాతం మధ్యలోనే ఉంది. ఇక కల్కి, దేవర చిత్రాలకు సైతం భారీగానే బడ్జెట్ వెచ్చించారు. కానీ జనవరి నెలలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ సినిమా మాత్రం కేవలం రూ.40 కోట్లతో నిర్మించారు. ఈ మూవీ ఏకంగా రూ.300-350 కోట్లు రాబట్టింది. దాదాపు 600 శాతానికి పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇదే. 2024లో అత్యధిక లాభాలు రాబట్టిన సినిమాగా హనుమాన్ నిలిచిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.