Nagarjuna: మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న నాగ్.. ఆకట్టుకుంటున్న ప్రీలుక్ పోస్టర్..

| Edited By: Anil kumar poka

Aug 28, 2021 | 8:40 AM

సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున స్టైలే వేరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు నాగార్జున. కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ..

Nagarjuna: మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న నాగ్.. ఆకట్టుకుంటున్న ప్రీలుక్ పోస్టర్..
Nag
Follow us on

Nagarjuna: సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున స్టైలే వేరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు నాగార్జున. కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు గేమ్ షోలతో బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు నాగ్. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‏కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో నాగ్ తోపాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. అలాగే నాగచైతన్యకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ మరో యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మూవీ ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ చూడగానే అదిరిపోయే యాక్షన్ సీన్స్‌‌‌‌కు కొదవేమీ ఉండదని అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో నాగ్ స్మశానంలో నడుస్తూ చేతిలో రక్తం కారుతున్న కత్తిని పట్టుకున్నట్టు చూపించారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29 న మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..