Keerthy Suresh: కల్కి సినిమాలో ఆ రోల్ చేయమన్నారు.. నేనే నో చెప్పా.. కీర్తిసురేష్ అలా అనేసిందేంటీ..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఓ పండగ అనే చెప్పాలి. మహాభారతం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు అలాగే డైరెక్టర్స్ కూడా కనిపించారు. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు.

Keerthy Suresh: కల్కి సినిమాలో ఆ రోల్ చేయమన్నారు.. నేనే నో చెప్పా.. కీర్తిసురేష్ అలా అనేసిందేంటీ..!
Kalki 2898ad
Follow us

|

Updated on: Aug 12, 2024 | 12:54 PM

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఎడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఓ పండగ అనే చెప్పాలి. మహాభారతం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు అలాగే డైరెక్టర్స్ కూడా కనిపించారు. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. ఇక ఈ సినిమాలో కీర్తిసురేష్ బుజ్జి అనే రోబోకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. కల్కి సినిమాలో బుజ్జి, ప్రభాస్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కల్కి సినిమా గురించి కీర్తిసురేష్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇది కూడా చదవండి : నల్లగా, చాలా లావుగా, ఛండాలంగా ఉన్నావ్ అన్నారు.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె..

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కీర్తిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ చనువుతోనే కల్కి సినిమాలో కీర్తికి బుజ్జి క్యారెక్టర్ కూడా వాయిస్ చెప్పే అవకాశం ఇచ్చారు నాగ్ అశ్విన్. ఇది అందరూ కంటూనే విషయం కానీ అసలు మ్యాటర్ వేరే ఉందట.

ఇది కూడా చదవండి : Mahesh Babu: మహేష్ బాబు దెబ్బకు బ్యాగ్రౌండ్ బయట పెట్టిన అక్కినేని కోడలు..

నిజానికి కల్కి సినిమాలో ఓ పాత్ర కోసం నాగ్ అశ్విన్ కీర్తిసురేష్ ను ఎంపిక చేశారట. ఈ విషయాన్నీ కీర్తినే తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడీ’ అనుకున్నప్పుడు నన్ను ఓ పాత్ర కోసం సంప్రదించారు. అయితే నేను ఆ పాత్ర చేయలేను అని చెప్పను.. ఆతర్వాత నాకు ఆ ప్రాజెక్ట్ లో భాగం కావాలని ఉంది అని నాగ్ అశ్విన్ కు మెసేజ్ చేశా.. అప్పుడు బిజి పాత్రకు వాయిస్ ఇవ్వాలని చెప్పాడు. దాంతో వెంటనే ఓకే చెప్పను. కల్కి సినిమాలో పాత్ర మిస్ అయ్యిందని నేను బాధపడను .. ఎందుకంటే బుజ్జి గా వాయిస్ ఇచ్చినందుకు సంతోషిస్తున్నా అని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. అయితే తనకు నాగ్ అశ్విన్ ఏ పాత్ర ఆఫర్ చేశారో మాత్రం చెప్పను అని తెలిపింది. అలాగే కల్కి పార్ట్‌ 2 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. కాగా కల్కి సినిమాలో మృణాల్ పాత్ర అయ్యుంటుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. సినిమాలో ఆమె పాత్ర చనిపోతుంది. అందుకనే కీర్తిసురేష్ రిజెక్ట్ చేసి ఉంటుందని అబిప్రాయ పడుతున్నారు కొందరు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..