Hero Yash: డాన్‌గా రాకీ భాయ్.. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో యశ్ నయా మూవీ

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు భారీ హిట్ గా నిలిచాయి. దాంతో యశ్ నెక్స్ట్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యశ్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో గీత మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ అలాగే నితీష్ తివారీ డైరెక్షన్ లో రానున్న రామాయణం. అంతేకాదు ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

Hero Yash: డాన్‌గా రాకీ భాయ్.. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో యశ్ నయా మూవీ
Yash
Follow us

|

Updated on: Jul 02, 2024 | 11:18 AM

కేజీఎఫ్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ పేరు మారుమ్రోగింది. అప్పటివరకు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన యశ్ అక్కడ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు భారీ హిట్ గా నిలిచాయి. దాంతో యశ్ నెక్స్ట్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యశ్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో గీత మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్, అలాగే నితీష్ తివారీ డైరెక్షన్ లో రానున్న రామాయణం. అంతేకాదు ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా ‘టాక్సిక్‌’ పనులు ప్రారంభమయ్యాయి. నిజానికి సినిమాలో ఓ పాత్ర విషయంలో చాలా కాలంగా డైలమా ఉంది మూవీ టీమ్. యష్‌కి సిస్టర్ గా నటించే యాక్టర్ కోసం చాలా ఎదురుచూశారు మూవీ టీమ్. గతంలో ఈ పాత్ర కోసం కరీనా కపూర్‌ని సంప్రదించారు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో నయనతార నటిస్తుందని తెలుస్తోంది.

ఇది యశ్ కమ్ బ్యాక్ సినిమా. అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో యశ్ డాన్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా 1950 , 1970 ల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. బెంగుళూరు శివార్లలో ఈ చిత్రం సెట్‌ను రూపొందించారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతోందని సమాచారం. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 10, 2025న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో యశ్‌తో పాటు అతని సోదరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో గీతూ మోహన్‌దాస్ కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో యశ్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)