మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న చంద‌మామ‌ !

|

Aug 11, 2020 | 7:47 AM

ఒక‌రిద్దరు మిన‌హాయిస్తే సౌత్‌తో బ‌డా హీరోలు అంద‌రి ప‌క్క‌న ఆడిపాడింది చంద‌మామ కాజ‌ల్. కానీ ఇటీవ‌ల కాలంలో ఆమె సినిమాలు జోరు త‌గ్గింది. వ‌ర‌స‌గా అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ, మీడియం రేంజ్ హీరోల సినిమాల‌తోనే స‌రిపెట్టుకుంది.

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న చంద‌మామ‌ !
Follow us on

‌Kajal To Star in Vijay movie : ఒక‌రిద్దరు మిన‌హాయిస్తే సౌత్‌తో బ‌డా హీరోలు అంద‌రి ప‌క్క‌న ఆడిపాడింది చంద‌మామ కాజ‌ల్. కానీ ఇటీవ‌ల కాలంలో ఆమె సినిమాలు జోరు త‌గ్గింది. వ‌ర‌స‌గా అవ‌కాశాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ, మీడియం రేంజ్ హీరోల సినిమాల‌తోనే స‌రిపెట్టుకుంది. అయితే తాజాగా ఆమెను ల‌క్ వెతుక్కుంటూ వ‌చ్చింది. మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ త్రిష ‘ఆచార్య’‌ మూవీ నుంచి తప్పుకున్న నేప‌థ్యంలో ఏకంగా మ‌రోసారి మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించే జాక్‌పాట్ కొట్టింది కాజల్. దీంతో మ‌రోసారి వెండితెరపై మ‌రోసారి త‌న జోరు చూపించేందుకు రెడీ అయ్యింది కాజ‌ల్. తాజాగా చంద‌మామ చెంత‌కు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ వ‌చ్చింద‌ట‌.

త‌మిళ స్టార్ హీరో విజయ్ సరసన కాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు స‌మాచారం. మురుగదాస్​ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతుంది. తాజాగా ఈ చిత్రం కోసం కాజల్​ను హీరోయిన్​గా పరిశీలిస్తున్నట్లు వార్తలు స‌ర్కులేట్ అవుతున్నాయి. త్వరలోనే దీనిపై అఫిషియ‌ల్ ప్రకటన రానుందట. మ‌రోవైపు బాలీవుడ్‌లో సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ముంబయి సాగా’ చిత్రంలోనూ నటిస్తోంది కాజ‌ల్.

 

Read Also : చైతూ-సామ్ : సో క్యూట్