JR NTR T Shirt: బింబిసార ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఎన్టీఆర్‌ టీషర్ట్‌.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు

|

Jul 30, 2022 | 6:02 PM

Bimbisara Pre Release Event: బింబిసార ఈవెంట్‌కు బ్లాక్‌ టీషర్ట్‌ ధరించి వచ్చాడు ఎన్టీఆర్‌. ఇది తారక్‌కు ఫర్ఫెక్ట్‌గా సెట్‌ అయింది. అంతేకాదు ఈ షర్ట్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడీ స్టార్‌ హీరో. ఈక్రమంలో ఎన్టీఆర్‌ షర్ట్‌ ధర ఎంత ఉంటుంది? అని అనుమానం వచ్చిన అభిమానులు నెట్టింట ఆరా తీశారు.

JR NTR T Shirt: బింబిసార ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఎన్టీఆర్‌ టీషర్ట్‌.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Jr Ntr
Follow us on

Bimbisara Pre Release Event: నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan ram) హీరోగా నటించిన చిత్రం. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈకార్యక్రమానికి కల్యాణ్‌ రామ్‌ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR NTR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. ఇక ఎప్పటిలాగే తనదైన స్పీచ్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు తారక్‌. ఇదిలా ఉంటే బింబిసార ఈవెంట్‌కు బ్లాక్‌ టీషర్ట్‌ ధరించి వచ్చాడు ఎన్టీఆర్‌. ఇది తారక్‌కు ఫర్ఫెక్ట్‌గా సెట్‌ అయింది. అంతేకాదు ఈ షర్ట్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడీ స్టార్‌ హీరో. ఈక్రమంలో ఎన్టీఆర్‌ షర్ట్‌ ధర ఎంత ఉంటుంది? అని అనుమానం వచ్చిన అభిమానులు నెట్టింట ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో తారక్‌ ధరించిన ఈ స్టైలిష్‌ బ్లాక్‌ టీషర్ట్‌ ఖరీదు అక్షరాలా రూ.24,000 అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కేవలం టీషర్టే అంత రేటా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో తారక్‌ రేంజ్‌ అలాంటిదని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమిలేని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు కూడా సైన్‌ చేశాడు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..