
టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఆయన కూడా ఒకరు. విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన జేడీ ఆ తర్వాత హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ గా కూడా సత్తా చాటారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన జేడీ గతంలోలా ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడు. అలా జేడీ చక్రవర్తి నటించిన లేటెస్ట్ సినిమా గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్ధుల్లా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింద. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. సినిమా సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు జేడీ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని కొందరు స్టార్ హీరోలు, నటులు గురించి షాకింగ్ విషయాలు బయటపెడుతున్నారు. అలా తాజాగా ఆయన సీనియర్ నటుడు, కామెడీ కింగ్ బ్రహ్మనందంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
బ్రహ్మానందం అంటేనే తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్. అయితే, ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సులభంగా సెట్స్‌లో ఉండరు. ఆయనకున్న క్రేజ్ ను బట్టే కొన్నిసార్లు ఆయన డిమాండ్లు కూడా అలాగే ఉంటాయి. కానీ ఆయన దర్శక నిర్మాతలకు ఇచ్చే అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా టైమింగ్ విషయంలో బ్రహ్మానందంకు ఒక పద్దతి ఉంటుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఒక సినిమా హిట్ అవ్వడంలో ఆయన పాత్ర ఎంత ఉందో, కష్టాలు కూడా అంతే ఉంటాయి. ఒక దర్శకుడి ప్లానింగ్ కు తగ్గట్టుగా బ్రహ్మానందం లాంటి ఒక పెద్ద నటుడు తనను తాను మార్చుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం’ అని జేడీ పేర్కొన్నారు.
కాగా మనీ, మనీ మనీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు జేడీ చక్రవర్తి, బ్రహ్మానందం. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
Enti JD Chakravarthy atreyapuram ha?? 🤯 ayina atyeyapuram pootharekulu nachani vallu evaru untaru #GaayaPaddaSimham pic.twitter.com/I4AIndq5If
— Charan_chowdary (@Sike_charan) May 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.